అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో బీటెక్ విద్యార్థిని సికెల్‌సెల్ ఎనీమియాతో మృతి చెందింది. కడశిల్ప గ్రామానికి చెందిన గోపీనాయక్ కోటి కుమార్తె హేమ (22) ఈ ఏడాది బీటెక్ పూర్తి చేసింది. ఆమె కొంతకాలంగా సికెల్‌సెల్ ఎనీమియాతో బాధపడుతోంది. రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను కేజీహెచ్‌కు తరలించగా మంగళవారం మృతి చెందింది.