గంజాయి విక్రయిస్తున్న నలుగురిని మంగళవారం అరెస్టు చేసినట్లు కైకలూరు సీఐ కృష్ణ కుమార్ తెలిపారు. ఎలికే రాజేష్ (దేవపూడి), అను తొత్తరంపూడి సురేంద్ర (సానారుద్రవరం), కొడాలి నాగేంద్ర వర్మ (కలిదిండి), సయ్యద్ నవయుత్ (కైకలూరు) గంజాయి మత్తుకు అలవాటుపడ్డారు. విక్రయాలు కూడా సాగిస్తున్నారు. రాజమండ్రి సమీపంలో గోకవరం నుంచి 15 రోజుల క్రితం గంజాయి తెచ్చి వెంకటాపురం పంట కాల్వ వద్ద దాచారు. అమ్మడానికి తీసుకె ళ్తుండగా ఎస్ఐ ప్రియకుమార్కు సమాచారం అందింది. ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల ప్రకారం డీఎస్పీ ఈ.శ్రీనివాసులు ఆధ్వర్యంలో కైకలూరు సీఐ కృష్ణ కుమార్ నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచడంతో కోర్టు రిమాండ్ విధించింది.