ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని విజయనగరం జిల్లా యుటీఎఫ్ నాయకులు కోరారు. మంగళవారం దత్తిరాజేరు ఎంఈవో-1,2లు యు.వెంకటరావు, వై.సుధాకర్‌లకు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని యుటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ కిల్లాడ అప్పారావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 117ను రద్దుచేయాలని, ప్రీ ప్రైమరీతో పాటు 1 నుంచి 5 తరగతులు ఒకే పాఠశాలగా నడపాలని కోరారు. తరిగతికొక ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీపీఎస్ సబ్ కమిటీ కన్వీనర్ పి.రాంప్రసాద్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రరావు, టి.రమేష్, ఉపాధ్యక్షురాలు మాధవీలత, కోశాధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.