వైసీపీ పాలనలో పెద్దఎత్తున భూదోపిడీ జరిగిందని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని విమర్శించారు. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగిందని మండిపడ్డారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడిందన్నారు. వైసీపీ నేతలు భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు భూముల ఆక్రమణలపై ఆదేశించారని తెలిపారు.