సికెల్‌సెల్ ఎనీమియా జన్యుపరమైన లోపం కారణంగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. బాధితుల్లో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఆరోగ్యవంతులైన మనుషుల్లో ఎర్ర రక్త కణాలు గుండ్రంగా ఉంటాయి. వాటి జీవితకాలం 120 రోజులు. అయితే సికెల్‌సెల్ ఎనీమియా బాధితుల్లో ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలో ఉంటాయి. 25 రోజులకే నశిస్తాయి. అయితే ఈ కణాలు నశించినంత వేగంగా కొత్త ఎర్రరక్త కణాలు ఉత్పత్తి కాకపోవడంతో ఈ వ్యాధి ఉన్నవారు రక్తహీనతకు గురవుతారు. సికెల్ సెల్ ఎనీమియా బాధితులు 15 రోజులకొకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే రక్తం మార్పించుకోవాలి. ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలతోపాటు వైద్యాధికారి సూచించిన జాగ్రత్తలు పాటించాలి.