జూలై నెలలో తిరుమలకు రికార్డు ఆదాయం వచ్చింది. 29వ సారి 100 కోట్లు దాటింది తిరుమల ఆదాయం. వరుసగా 29వ నెల 100 కోట్ల మార్క్ ను దాటింది. జూలై నెలలో శ్రీవారికి హుండి ద్వారా 125 కోట్లు సమర్పించారు తిరుమల భక్తులు. ఈ ఏడాదిలో జూలై నెలలో వచ్చిన హుండి ఆదాయమే అత్యధికం కావడం విశేషం. ఇది ఇలా ఉండగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వున్నారు.