ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుపేదలకు ఆదుకునే విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేస్తున్నారని వీటిని సద్వినియోగం చేసుకోవాలని నరసన్నపేట మీడియా కన్వీనర్ బగ్గు అర్చన కోరారు. గురువారం పోలాకి మండలం మగతపాడు పంచాయతీలో లబ్ధిదారులకు ఆమె పింఛన్లు పంపిణీ చేశారు. నేడు పింఛన్లు మొత్తం చెప్పి నాలుగు వేలు అందిస్తున్నామన్నారు. ఆమెతోపాటు మాజీ సర్పంచ్ కరుకోల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.