శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం గుట్టూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ విద్యార్థులకు డైరీలు ఉచితంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం తో పాటు, ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.