అధికారులు చేసే నిర్లక్ష్యం కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎర్రగొండపాలెంలోని కొలుకుల రహదారిలో మార్గ మధ్యలో సాగర్ జలాల కోసం అధికారులు గొయ్యి తవ్వి ఉన్నారు. మరమ్మతుల అనంతరం ఆ గొయ్యికు రక్షణ లేదా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయక పోవడంతో చిన్నారులు, వృద్ధులు అందులో పడే ప్రమాదం ఉందని ప్రజలు గురువారం తెలిపారు. ఏదైనా ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa