కొరిశపాడు మండలం కొరిశపాడు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు నుంచి కొండమూరు వెళుతున్న స్కూటీని వెనకనుంచి వస్తున్న కారు ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కొండమూరు కు చెందిన నాగేశ్వరరావు, ముప్పవరం కు చెందిన రామచంద్ర రావు లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు తరలించారు. హైవే పోలీసులు కారును టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa