బాపట్ల మండలం పుండ్ల గ్రామంలో గురువారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గ్రామంలో ఇంటింటికి కూటమి సభ్యులతో కలిసి పెన్షన్ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో అర్హులకు సంక్షేమ పథకాలు నూరు శాతం అందిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.