ఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ సెంటర్ (NASC) కాంప్లెక్స్‌లో శనివారం జరిగే 32వ వ్యవసాయ ఆర్ధికవేత్తల అంతర్జాతీయ సదస్సు (ICAE)ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. సదస్సును ఉద్దేశించి ప్రధాని ప్రారంభోపన్యాసం చేస్తారని పీఎంఓ వెల్లడించింది. 65 ఏండ్ల తర్వాత భారత్‌లో ఐసీఏఈ జరగనుంది. నిలకడైన వ్యవసాయ ఆహార వ్యవస్ధల దిశగా ప్రస్ధానం అనే అంశాన్ని ఈ ఏడాది సదస్సు థీమ్‌గా ఎంచుకున్నారు.