కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పేర్కొన్నారు. జి. సిగడాం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఇచ్చిన ఉచిత పుస్తకాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.