పథకాలు అందించడమే కాదు.. వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూచించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై శుక్రవారం సీఎం సమీక్ష చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశుమరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. సమీక్షలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు.