వైసీపీ హయాంలో ఏపీలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై తాజా నివేదికలతో ఏపీ ప్రభుత్వం, కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అఫిడవిట్లు దాఖలు చేశాయి. అనంతరం సుప్రీంకోర్టు విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఇప్పటికే 8 జిల్లాల్లో తనిఖీలు జరిపామని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అఫిడవిట్లో పేర్కొంది.