శ్రీకాకుళం నగరంలోని దత్తాత్రేయ ఆలయ సమీపంలోని ఓ లాడ్జిలో యువకుడు ఫ్యాన్ హుక్కుకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఓ లాడ్జిలో రిసెప్షనిస్ట్‌గా బూర్జ మండలం అన్నంపేటకు చెందిన కరణం మహేష్(27) పనిచేస్తున్నాడు. రెండు రోజులుగా అతడు పనికి రాకపోవడం తో యజమాని మహేష్ ఇంటికి వెళ్లి వివరాలు అడిగాడు. అక్కడకు కూడా రాకపోవడంతో తిరిగి వచ్చేశాడు. అయితే సమీపంలోని ఓ లాడ్జిలోని రెండో ఫ్లోర్లో కంపు కొడుతుండడంతో లాడ్జి సిబ్బంది రూమ్ తలుపులు బద్దలుగొట్టగా.. ఫ్యాన్ హుక్కుకి మహేష్ ఉరి వేసుకుని ఉన్నాడు. దీంతో సిబ్బంది టూటౌన్ పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అతడి అన్నయ్య కరణం తేజేశ్వరరావు ఫిర్యాదు మేరకు సీఐ జి.ఉమామహేశ్వరరావు కేసు నమో చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కి తరలించారు. కాగా తల్లిదండ్రులు చిన్నప్పడు, మంగమ్మ తమ కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు.