ఇటీవలి ఎన్నికల్లో దేశంలోని చాలా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి ఇండియా కూటమిగా పోటీ చేసినా.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించలేకపోయారు. ఇక అంతర్జాతీయంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎంతో గౌరవం ఉంది. ఏ దేశానికి వెళ్లినా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతున్నారంటే.. అంతర్జాతీయంగా మోదీ రేంజ్ ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ప్రజాదరణలో అంతర్జాతీయంగా మోదీ నంబర్ వన్‌గా నిలిచారు. మోస్ట్ పాపులర్ గ్లోబర్ లీడర్ జాబితాలో నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అంతర్జాతీయ పరిణామాలపై కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ దేశాలకు, రష్యాకు జరుగుతున్న యుద్ధంలో భారత్ అనుసరిస్తున్న తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏకకాలంలో అటు రష్యాతో పాటు అటు అమెరికాతోనూ సత్సంబంధాలను మోదీ కొనసాగిస్తున్నారు. ఇక తాజాగా నిర్వహించిన గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్స్‌లో ప్రపంచ దేశాధినేతలకు ఉన్న ప్రజాదరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్-హమాస్.. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో విడుదలైన ఈ గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్స్‌లో మోదీ అగ్రస్థానంలో నిలిచారు.
ఈ రేటింగ్స్‌లో 69 శాతం రేటింగ్‌లతో అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవతరించారని మార్నింగ్ కన్సల్ట్ ఇటీవల నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ నేతగా తొలి స్థానంలో నరేంద్ర మోదీ నిలిచారు. అయితే గతంలో పోలిస్తే కొంచెం 7 శాతం రేటింగ్ తగ్గింది.
మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ టాప్-10 నేతలు
నరేంద్ర మోదీ - భారత ప్రధానమంత్రి
ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రడార్ – మెక్సికో అధ్యక్షుడు
జేవియర్ మిలీ – అర్జెంటీనా అధ్యక్షుడు
వియోలా అమ్హెర్డ్- స్విట్జర్లాండ్ ఫెడరల్ కౌన్సిలర్
సైమన్ హారిస్ – ఐర్లాండ్ మంత్రి
కీర్ స్టార్మర్ – యూకే ప్రధాని
డోనాల్డ్ టస్క్ – పోలాండ్ మాజీ ప్రధానమంత్రి
ఆంథోనీ అల్బనీస్ – ఆస్ట్రేలియా ప్రధానమంత్రి
పెడ్రో సాంచెజ్ – స్పెయిన్ ప్రధానమంత్రి
జార్జియా మెలోని – ఇటలీ ప్రధానమంత్రి