ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చించారు. గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో భూమి పొందిన వారు, మళ్లీ నిర్మాణాలు చేపట్టే అంశంపై సీఎం చర్చించారు. ఏపీ ఎడ్యుకేషన్ హబ్‌గా కావడానికి ఎలాంటి సంస్థలను ఆహ్వానించాలి, ఎవరికి భూములు కేటాయించాలనే అంశంపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. సంపద సృష్టికి కేంద్రాలుగా అమరావతిని మార్చేవారికి భూ కేటాయింపులు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. టాప్ 10 కాలేజీలు, టాప్ 10 స్కూల్స్, టాప్ 10 ఆస్పత్రులు ఏర్పాటు కావాలని ఆదేశించారు. జీవో 207 ప్రకారం 8352 స్వేర్ కిలోమీరట్ల పరిధిలోనే రాజధాని ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.