తంబళ్లపల్లె మండలంలో 6,265 మంది పింఛను దారులు ఉండగా గురువారం సాయంత్రానికి 6,120 మందికి 98 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు ఎంపీడీవో క్రిష్ణమూర్తి తెలిపారు. సచివా లయ సిబ్బంది ఉదయం 5:30ల నుంచే స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలసి ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం చంద్రబా బునాయుడుకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో టీడీపీ మండలాధ్య క్షుడు రెడ్డప్పరెడ్డి, సిద్దమ్మ, క్లస్టర్ ఇంచార్జి బేరిశీన, సోము శేఖర్, మాజీ జడ్పీటీసీ రామచంద్ర, యూనిట్ ఇనచార్జి నారాయణ, తెలుగు యువత నరసింహులు, ఆనంద్ నాయుడు, నరేంద్రనాయుడు, ఎమ్మార్పీఎస్ జగ దీష్, భాస్కర్, జనసేన నాయకులు పాల్గొన్నారు.