ఎమ్మిగనూరు మండలం నూతన తాహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన శేష ఫనిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖాసీం వల్లి , ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్ , యువ కాంగ్రెస్ నాయకులు కలందర్ శనివారం మర్యాదపూర్వకంగా కలసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, రెవిన్యూ సమస్యలపై స్పందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకేష్, రఫీక్, స్వామి పాల్గొన్నారు.