యాడికి సమీపంలోని చందన రోడ్డు వద్ద తవ్వేసి మట్టి తరలించిన ప్రాంతాన్ని శుక్రవారం గనుల శాఖ అధికారులు పరిశీలించారు. తాడిపత్రి మైనింగ్ ఆర్ఐ రామాం జినేయులు మరొకరు కలిసి పరిశీలించారు. ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టిని తరలించారు, ఎంత మేర లోతు, వెడల్పుతో తవ్వకాలు చేశారన్న దానిపై కొలతలు తీశారు. ఇక్కడి తవ్వకాలపై ఉన్నతాధికారులకు నివేదిక పంప నున్నట్లు వారు తెలిపారు.