రాజవొమ్మంగి మండలంలోని శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన కురిసిన భారీ వర్షానికి రాజవొమ్మంగి గ్రామ శివారు మలుపు వద్ద శనివారం ఉదయం జాతీయ రహదారి 516 ఈ కి అడ్డంగా భారీ చెట్టు నేల కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎఫ్ఎస్ఓ రాము, సిఐ ఎస్ సన్యాసి నాయుడు, ఎస్ఐ వెంకయ్య ఆధ్వర్యంలో సిబ్బంది స్థానికులతో కలిసి రహదారికి అడ్డంగా కూలిన చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్దించారు.