బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని ఉప్పరపాలెం రైల్వే గేటు వద్ద అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు శనివారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, అధికారులతో కలిసి పరిశీలించారు. దశాబ్దాలుగా ఈ గేటు వద్ద తీవ్ర ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు అనేక ప్రమాదాలు జరిగాయి. ఎమ్మెల్యే వేగేశన చొరవతో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. పట్టణ ప్రణాళిక శాఖ అధికారులతో చర్చించారు.