కొర్రపంటను సాగు చేయడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చని గుత్తి ఏడీఏ వెంక ట్రాముడు, ఏఓ మల్లీశ్వరి సూచించారు. శుక్రవారం పెద్దవడుగూరు మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం వద్ద పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తి పంట సాగు చేసిన రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం పత్తి, కొర్ర పంట పొలాలను పరిశీలించారు. కొర్రపంట సాగు చేసిన రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa