గుంతకల్లు పట్టణంలోని ప్రశాంత్ నగర్ లో నీలావతి అనే మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కొని పరారయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. రిటైర్డు ఏఎస్ఐ త్యాగరాజు సతీమణి నీలావతి శుక్రవారం ఇంటి ముందు చెత్తను ఊడ్చి సమీపంలోని డస్ట్‌బిన్ లో వేసేందుకు వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు బైక్ పై వచ్చి బంగారు గొలుసును లాక్కొని వెళ్ళారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.