విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ విద్యాలయంలో ‘ఉన్నత విద్యాసంస్థల్లో జాతీయ విద్యా విధానం–2020 అమలు, సవాళ్లు’ అనే అంశంపై అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్మహాసంఘ్ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.దేశాన్ని అన్ని రంగాల్లోనూ సమున్నత స్థానానికి తీసుకెళ్లే లక్ష్యంగా గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన గొప్ప కార్యక్రమాల్లో ‘జాతీయ విద్యా విధానం–2020’ ఒకటి.బట్టీ విధానానికి స్వస్తి పలికి సృజనాత్మకత పెంపొందించడం, ప్రతి ఒక్కరూ చదువుకునేలా చేయడం నూతన విద్యావిధానం ముఖ్యాంశాలు. ఇందులోని మరో గొప్ప అంశం.. విద్యార్థి దశలోనే నైపుణ్య శిక్షణ. దీనివల్ల స్వయం ఉపాధితోపాటు చదువుకునే వెసులుబాటు ఉంది.కేంద్రం తెచ్చిన ఈ కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రాలు ఆమోదించడమే మొట్టమొదటి సవాల్. అంతేకాదు, విద్య కోసం రాష్ట్రాలు కూడా తమ వంతు బాధ్యతగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటిని అధిగమిస్తే నూతన విద్యావిధానం ఒక సరికొత్త ఒరవడి సృష్టిస్తుంది.ఏ దేశంలో అయినా విద్యాభివృద్ధి ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఇది సాకారమవ్వాలంటే భారతీయ విలువలతో కూడిన విద్యావిధానం అవసరం. జాతీయ విద్యావిధానం–2020 అచ్చంగా అలాంటిదే. దీని గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసి, అమలయ్యేలా చూడాలని అందరినీ కోరుతున్నారు.