విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు తలపెట్టిన జీపు జాత రాయదుర్గం కు చేరుకుంది. దీంతో శనివారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థినులతో పెద్దఎత్తున సమావేశం నిర్వహించారు. జూనియర్ కళాశాలలో మధ్యాహ్నభోజన పథకం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జయప్రదం చేయాలన్నారు.