రాష్ట్రంలో 42,518 మంది ఆశావర్కర్లు ఉన్నారని కేంద్రం స్పష్టం చేసింది. శుక్రవారం, లోక్సభలో ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జిల్లాల వారీగా ఆశావర్కర్ల నియమాకానికి సంబంధించిన వివరాలు కేంద్రం వద్ద ఉండవని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు ఆశావర్కర్లు కంటి, ఈఎన్టీ, అత్యవసర వైద్య సేవలు, ప్యాలియేటివ్ కేర్ వంటి వాటిలో శిక్షణ పొందినట్లు తెలిపారు.