మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం మండలంలో కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. విశాఖ- బీ కాలనీకి చెందిన జామి శ్రీనివాసరావుతో చందన(30) అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా చందన ఆనారోగ్యానికి గురై మానసికంగా బాధపడుతుంది. శుక్రవారం సాయంత్రం భర్తతో పాటు సమోసాలు చేసే పనిలో నిమగ్నమైన ఆమె.. ఐదు గంటల సమయంలో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరువేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంతకి గదిలోంచి చందన రాకపోవడంతో వెళ్లి చూడగా.. బెడ్రూమ్ తలుపులు లోపలి నుంచి గెడ పెట్టి ఉంది. ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి శ్రీనివాసరావు లోపలికి వెళ్లి చూడగా.. తన భార్య ఫ్యాన్‌కు ఉరేసుకొని వేళాడుతూ కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.