ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకం కింద పొందే సేవలకు ప్రభుత్వం రూ.25 లక్షల వరకూ చెల్లిస్తుందని విశాఖపట్నం జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు తెలిపారు. ఒక కుటుంబం ఏడాదిలో రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యాన్ని పొందవచ్చునన్నారు. జిల్లాలో ఎన్‌టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్‌లో 105 (45 ప్రభుత్వ, 38 ప్రైవేటు, 22 డెంటల్) ఆస్పత్రులు ఉన్నాయన్నారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో రోగులకు సహకారాన్ని అందించేందుకు 85 మంది ఆరోగ్యమిత్రలు ఉన్నట్టు తెలిపారు. ఏవైనా ఇబ్బందులుంటే మిత్రలు దృష్టికి తీసుకు వెళ్లవచ్చునన్నారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే తనకు (నంబర్ 9281068145)కు ఫిర్యాదు చేయాలన్నారు. నెట్ వర్క్ ఆస్పత్రుల్లో రోజుకు కనీసం వేయి మంది వరకు కొత్తగా చేరుతున్నారన్నారు. తాను ప్రతిరోజూ ఒక ఆస్పత్రిని తనిఖీ చేస్తున్నట్టు వెల్లడించారు. రోగులతో మాట్లాడి ఇబ్బం దులను తెలుసుకుంటున్నట్టు వెల్లడించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. అదనంగా డబ్బులు అడుగుతున్నారని చెబుతున్నారని, వెంటనే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.