బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా, రేగిడి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రేగిడి సివిల్సప్లయ్ గొడౌన్లో ఆమదాలవలస గ్రామానికి చెందిన కుమిలి రాంబాబు(35) కళాసీగా పనిచేస్తున్నాడు. ఈయనకు నాలుగేళ్ల క్రితం చిన్నశిర్లాం గ్రామానికి చెందిన సంతుతో వివాహమైంది. వీరికి రెండేళ్లు పాప పూజిత ఉంది. ఇటీవల అత్తవారి ఊర్లో వారాలు కాగా భార్యను పంపించి తాను వెళ్లలేకపోయాడు. దీంతో భార్యను చూసేందుకు శుక్రవారం ఉదయం చిన్నశిర్లాంలోని అత్త వారింటికి వెళ్లాడు. అక్కడి నుంచి శుక్రవారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న బావిలో పడిపోయి ఉన్నట్టు గ్రామస్థులు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఈ ఘటనపై ప్రమాదమా లేదా ఆత్మహత్యా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎస్ఐ శ్రీనివాస్ మాత్రం ఈయన మద్యం మత్తులో ఉన్నట్లు, స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోయి ఉండవచ్చుని ప్రాథమిక సమాచారంగా చెప్పారు. కుటుంబీకుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం రాజాం పంపించినట్లు తెలిపారు.