విజయనగరం జిల్లా, రామభద్రపురం మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. స్థానికంగా వ్యాపారం చేస్తున్న పప్పు ఈశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఇదే అదునుగా చూసిన దొంగలు ఈ చోరీకి ప్లాన్ వేశారు. ఇంటిలోని బీరువాలో ఉన్న సుమారు 25 తులాల బంగారం, అరకేజీ వెండి అపహరించి నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీనిపై సమీప బంధువు పప్పు రాంబాబు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలాన్ని విజయనగరం క్లూస్ టీం పరిశీలించారు. క్లూస్‌టీం ఎస్ఐ మురళీమోహన్ ఆధ్వర్యంలో వేలిముద్రల నమూనాలు సేకరించా రు. బాడంగి ఎస్ఐ జయంతి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యు లతో మాట్లాడారు. దీనిపై ఏఎస్ఐ అప్పరావు కేసు నమోదు చేశారు.