కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విపక్ష నేతలపై పగ, ప్రతీకారం తీర్చుకోవడం పక్కనపెడితే.. సొంత పార్టీ నాయకులైనా.. తనను నమ్ముకున్న అనుచరులైనా సరే.. తప్పు చేస్తే శిక్ష తప్పదు అంటున్నారట. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై ఆయన అనుచరులే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు కోటంరెడ్డిలో ఈ మార్పు ఏమిటి.. ఇదేమైనా వ్యూహంలో భాగమా అనే చర్చ జరుగుతుందట. ఎవరైనా విపక్ష పార్టీ నేతలు అక్రమంగా ఇసుక, మైనింగ్ వ్యవహరాల్లో తలదూరిస్తే లక్ష రూపాయిల జరిమానా, సొంత పార్టీ నేతలైతే రూ.2లక్షల జరిమానా అంటూ సొంత పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారట. కోటంరెడ్డి గురించి తెలిసిన వాళ్లు ఈ విషయం విని ముక్కున వేలేసుకుంటున్నారట.