తిరుపతి జిల్లావ్యాప్తంగా నిబంధనలు పాటించని 26 ల్యాబులను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు ల్యాబులను గుర్తించి, సీజ్ చేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 17 బృందాలను ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌వోపాటు ఈ బృందాల్లో అధికారులు ఒక్క రోజులోనే 90 ప్రైవేటు ల్యాబులను పరిశీలించారు. వీటిల్లో నిబంధనలు పాటించని 26 ల్యాబులను సీజ్ చేశారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టామన్నారు. ల్యాబుల నిర్వాహకులు రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్లతోపాటు నిబంధనలు పాటించకున్నా, అధిక ధరలు వసూలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంగళం పరిధిలో జరిగిన తనిఖీల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారులు జయంతి, స్రవంతి, ఎంపీహెచ్‌ఈవో మురళి, తదితరులు పాల్గొన్నారు.