చిన్నారుల్లో ఎదుగుదల సమస్యగా మారిన ఆటిజం వ్యాధిని త్వరగా గుర్తించాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ సి.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నగరంలోని ప్రకాష్‌నగర్‌లో అంబికా శిశు కేంద్రం ఇన్స్‌ట్యూట్ డిసిబిలిటీ వర్క్‌షాపు జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్‌రావు, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రైస్ ఫాతిమాతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ..... ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం అంబికా శిశు కేంద్రంలో అందిస్తున్న సేవలను కొనియాడారు. ఆటిజం కోసం మెడికల్ సర్టిఫికేట్ జారీ చేయడానికి అర్హత కలిగిన వైద్యులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఆర్‌సీఐ ఆమోదించిన డిప్లమో ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంటలెక్చ్యుయల్ డిసేబిలిటీ (డీఈసీఎస్‌ఈ-ఐడీ) పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శనివారం ఉదయం 10 గంటలకు జరిగే సదస్సు రెండో రోజులో కన్వొకేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అంబికా శిశుకేంద్రం డైరెక్టర్ బిందు షా తెలిపారు. కార్యక్రమంలో అంబికా శిశు కేంద్రం డైరెక్టర్ బిందు, కృష్ణవేణి, డా.సరోజ, ఆర్య, వీఆర్పీ శైలజారావు, కర్నూలు జీజీహెచ్ మానసిక వ్యాధుల విభాగపు హెచ్‌వోడీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.