నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ ఇన్ ఫ్లో : 4,19,588 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 34,088 క్యూసెక్కులకు చేరుకుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 558.60 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం : 312.50 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 229.13 టీఎంసీలకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద భారీగా తగ్గిపోయింది. స్పిల్ వే ఎగువన 31.290, దిగువన 22.595 మీటర్ల నీటి మట్టం చేరుకుంది. గోదావరి దిగువకు 7 లక్షల 16 వేల 051 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa