తంబళ్లపల్లె లోని టీఎన్ వెంకటసుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటీఐలో శనివారం తిరుపతి శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూజర్ కంపెనీ ప్రతి నిధి రవికుమార్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ ట్రేడ్లకు చెందిన 50 మంది జాబ్ మేళాకు హాజరయ్యారు. వారిలో సామర్థ్యాన్ని బట్టి 25 మందిని ఎంపిక చేశారు. వారికి రూ. 25 వేల వేతనం ఇచ్చే విధంగా కాల్ లెటర్స్ అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నాగరాజు, టీఓలు పాల్గొన్నారు.