శ్రీశైలం ఎగువన ఉన్న తుంగభద్ర, సుంకేసుల, జూరాల జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో ఈ మూడు ప్రాజెక్టులకు వచ్చిన వరదను దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు అధికారులు. ప్రస్తుతం శ్రీశైలానికి 4,50,064 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 5,22,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.