చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా అమ్మవారు మహంకాళి రూపంలో ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఆలయంలో విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు, అర్చక స్వాములు తెలియజేశారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమ్మకాయ దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.