గత ప్రభుత్వంలో పాలకులు వ్యవస్థను నిర్వీర్యం చేసి, అధికార యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని నియోజకవర్గంలోని మహిళలపై పెట్టిన అక్రమ ఎస్సీ ఎస్టీ కేసులతో పాటుగా పలు కేసులను విచారించి తొలగించాలని మహిళా కమిషన్ విజయభారతి కి అర్జీ ఇవ్వడం జరిగింది. విచారణలో భాగంగా తిరుపతి ఎస్.వి వైస్ ఛాన్స్లర్ కార్యాలయానికి వచ్చిన జాతీయ మహిళా కమిషన్ విజయభారతి ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కలసి వాతపూర్వకంగా అర్జీ ఇచ్చి వివరించారు. గత ప్రభుత్వంలో మహిళలు అనే విచక్షణ కోల్పోయి సుధా రెడ్డి పై జరిగిన దాడిని వివరించారు. అధికారులను అడ్డం పెట్టుకొని మఠం భూమిలోను కట్టడాలను తొలగిస్తుండడంతో నష్టపోయిన మహిళలు పులివర్తి సుధా రెడ్డికి సమాచారం ఇచ్చారు. తుమ్మలగుంట లోని మఠం భూములు తొలగింపు వద్దకు చేరుకున్న సుధా రెడ్డిని పోలీసులు తిరుపతి ఈస్ట్ సీఐగా పనిచేస్తున్న మహేశ్వర్ రెడ్డి, రేణిగుంట సిఐగా పనిచేస్తున్న మల్లికార్జున్ లు అవహేళన చేసి దుర్భాషలాడారు. అంతేకాకుండా ఆమెను దౌర్జన్యంగా పక్కకు లాగి వేయడంతో ఆమె కాలికి గాయమై ఇప్పటికి కోలుకోలేని స్థితిలో ఉన్నారని కమిషన్ కు ఎంఎల్ఏ వివరించారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని మహిళలపై ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు పెట్టి సోషల్ మీడియా వేదికగా వారి గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టి వారి వ్యక్తిగత జీవనానికి భంగం కలిగించారని గత ప్రభుత్వం మహిళలపై ప్రవర్తించిన తీరును కమిషన్ కు వివరించారు. సుధా రెడ్డి పై జరిగిన దాడికి సంబంధించి పలుమార్లు అప్పటి జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు ఆర్జీ ఇచ్చినప్పటికీ అధికారులు స్పందించలేదు. రాష్ట్ర మహిళా కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారికి తెలియపరచడం జరిగింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు న్యాయపోరాటంతో శిక్షించాలని తెలిపారు. అందుకే నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని కమిషన్ కు వివరిస్తున్నానని తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, మహిళలపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని ఆయన కోరారు.