జామి మండలంలో భీమసింగి -బలరాంపురం గ్రామాల మధ్య నిర్మించిన వంతెనకు ఇరువైపులా పాదచారులను ఉద్దేశించి వాక్ వే నిర్మించారు. దానిపై వర్షపు నీరు పోవడానికి ఇరువైపులా అధికారులు డ్రెయిన్లు నిర్మించారు. కానీ వాటిపై మూతలు వెయ్యడం మరిచారు. నిత్యం రద్దీగా ఉన్న వంతెనపై ప్రదకరంగా గుంతలు ఉండటంతో పాదచారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.