గత కొన్ని రోజులుగా రాజాంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వీటి కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో ఏ కూరగాయల ధరలను చూసినా రూ. 60కి తక్కువ ఉండటం లేదు. కిలో టమాట ధర రూ 60 ఉంది. అదేవిధంగా ఉల్లిపాయలు, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, కాకరకాయలు, చిక్కుళ్ళ ధరలు సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేవు. దీంతో కిలో కొన్న దగ్గర అరకిలోతో ప్రజలు సరిపెట్టుకుంటున్నారు.