వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ.5లక్షల కోట్లు దోచేశారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఒక్కడే రూ.2 లక్షల కోట్లను స్వాహా చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఎటు చూసినా వారు చేసిన అక్రమాలు, కబ్జాలు అనేకం వెలుగులోకి వచ్చాయని అన్నారు.జగన్ పాలనలో జరిగిన మద్యం విక్రయాల్లోనే భారీ కుంభకోణం బయటపడుతుందని తెలిపారు. వైసీపీకి రాజకీయాలు లేకుండా చేస్తామని పేర్కొన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సున్నా అని.. త్వరలోనే వైసీపీ కూడా అదే స్థితికి రాబోతుందని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు.వైసీపీ పాలనలో రాష్ట్రంలో కబ్జాలు, తప్పులు జరగని ప్రాంతం ఏదీ లేదని విమర్శించారు.