ఏపీని గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. వైసీపీని ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రూ.5 లక్షల కోట్లు దోచేశారు. జగన్ ఒక్కరే రూ.2 లక్షల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు.