కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మరోసారి విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది. ఈ 2 నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయింది. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయని ట్వీట్ చేశారు.