ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నంద్యాల జిల్లాలో హత్యకి గురైన వైసీపీ కార్యకర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 05, 2024, 02:37 PM

నంద్యాల జిల్లాలోని మహానంది మండలం సీతారామపురంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి కొందరు అధికార పార్టీ నేతలు సుబ్బారాయుడు ఇంటికి వచ్చి ఘర్షణకు దిగినట్లు వైసీపీ నేతలు తెలియజేసారు. అనంతరం, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లే క్రమంలో సుబ్బారాయుడుపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. దీంతో, సుబ్బారాయుడు మృతిచెందాడు. మరోవైపు.. సుబ్బారాయుడిపై దాడిని ఆయన భార్య బాలసుబ్బమ్మ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా దాడులు చేశారు. దీంతో, ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు వారి ఇంట్లోని వస్తువులను, సామాగ్రిని ధ్వంసం చేశారు. అయితే, ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీకి పనివచేశారనే అక్కస్సుతోనే టీడీపీ నేతలు.. సుబ్బారాయుడిని హత్య చేశారు అని వైసీపీ నేతలు వాపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com