ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగిపై దాడికి పాల్పడిన తోటి ఉద్యోగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 05, 2024, 02:44 PM

అనంతపురం జిల్లా, డీ.హీరేహాళ్‌ మండలకేంద్రం సమీపంలో గల ఆపిల్‌ ఐరన ఓర్‌ ఫ్యాక్టరీలో పలువురు ఉద్యోగులు తోటి ఉద్యోగిపై దాడి చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫ్యాక్టర్‌లో ప్రాసెసింగ్‌ ఇనచార్జి సతీష్‌, ల్యాబ్‌ ఇనచార్జి, జేసీబీ ఆపరేటర్‌ గంగిరెడ్డి నడుమ కొన్ని రోజులుగా పని విషయమై మనస్పర్ధలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళుతున్న సతీ్‌షపై గంగిరెడ్డి, హనుమంతరెడ్డి మరో ఇద్దరితో కలిసి ఓబుళాపురం చెక్‌పోస్ట్‌ వద్ద కర్రలతో దాడి చేశారు. దీంతో సతీ్‌షకుతీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com