వలంటీర్లను సర్వీసుల నుంచి తొలగిస్తూ జారీచేసిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ విజయనగరం జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు డిమాండ్‌చేశారు. ఆదివారం పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఏపీసచివాలయం, గ్రామ,వార్డు వలంటీర్ల యూనియన్‌ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.... నగర పంచాయతీ కార్యాలయం పరిధిలో వీవర్స్‌కాలనీ వార్డు సచివాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్న 11 మంది, శ్రీరామ కళిమందిరం వార్డు సచివాలయం ఐదుమంది వలంటీర్లను సర్వీసుల నుంచి తొలగిస్తూ నోటీసులు మూడో తేదీన వాట్సాప్ ద్వారా పంపించినట్లు తెలి పారు. వీవర్స్‌కాలనీ వార్డు సచివాలయం అడ్మిన్ సెక్రటరీ సమాచారం మేరకు తొలగిస్తున్నట్టు నోటీసు ఇవ్వడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనని చెప్పారు. పాల కొండ నగరపంచాయతీలో మొత్తం 17మంది వలంటీర్లు రాజీనామా చేయలేదని రమణారావు పేర్కొన్నారు. వీవర్స్ కాలనీ అడ్మిన్ సెక్రటరీ వలంటీర్‌కు గైర్హాజర య్యారని పేరుమీద తొలగించం సరైనది కాదన్నారు. రాజకీయ ఒత్తిడికి అంద రూ రాజీనామా చేసినా, 17 మంది రాజీనామాలు చేయకుండా విధి నిర్వహణలో ఉంటే వారికి వేతనాలు కూడా ఇవ్వలేన్నారు. తక్షణమే నోటీసులను ఉప సంహరించు కోవాలని కోరారు.