రైస్‌మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అయితే రైతులు పండించిన పంటను సకాలంలో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మిల్లర్లు పూర్తిగా సహకరించాలని కోరారు. ఆలమూరులో ఆదివారం ఆలమూరు మండల రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతోపాటు పలువురు జనసేన, టీడీపీ నేతలు రెడ్డి సుబ్రహ్మణ్యం, బండారు శ్రీనివాస్, కెవీ.సత్యనారాయణరెడ్డి, ఆకుల రామకృష్ణ, బండారు సంజీవ్‌లను సత్కరించారు. గత ప్రభుత్వ కాలంలో రైస్‌మిల్లర్లు ఎదుర్కొన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని పరిష్కరిస్తామన్నారు. ధాన్యం కొనుగోలులో డివిజన్‌ను యూనిట్‌గా తీసుకుని కొనుగోలు సాగించాలని, దీనివల్ల రైతులకుప్రయోజనం జరుగుతుందని ఎమ్మెల్యే బండారు కోరారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వంటిపల్లి పాపారావు, చుండ్రు శ్రీనివాస్, వంక అన్నవరం, రెడ్డి రామారావు, వట్టికూటి సతీష్, వైట్ల దుర్గారావు, గుణ్ణం శ్రీనివాస్, కోరా వీరభద్రరావు పాల్గొన్నారు.