ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్పర్ధలతో భార్య ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 05, 2024, 03:17 PM

టెక్కలి పరిధిలోని నర్సింగపల్లి పంచాయతీ కిట్టాలపాడు గ్రామానికి చెందిన మోద నాగవేణి(42) శనివారం గడ్డిమందు తాగి శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తన ఫోన్‌కు వచ్చిన అసభ్య మెసేజ్‌ల నేపథ్యంలో భర్త నారాయణరావుతో తగాదా పడి గడ్డిమందు తాగింది. హుటాహుటిన ఆమెను టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు కుమార్తె శ్రీదేవి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com